Category Archives: Telugu

Govindam Paramanandam [telugu]

Life in Sanskrit (Telugu)

Click to Read Samskrutaya Jeevanam Subhashitanjali in slideshare

ప్రవచన అమృత ధార

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు మనకు అనుగ్రహించిన ప్రవచన అమృత ధారలను http://telugu.srichaganti.net/Default.aspx  ఉంచటమైనది. వారి మాటలలో కలిగే స్వాంతనము వినవలసినదే కాని చెప్పతరము కాదు. ఆ మాటలో శాస్త్రీయత ఉంది. చికాకుపడ్డవారికి అభయము, ఆదరణ ఉంది.  ఈ బ్లాగు తెలుగు వినియోగదారులు  విని ఆదరించండి మరియు ఆనందించండి.  సంప్రదించుటకు - http://telugu.srichaganti.net/ContactUs.aspx

వేదములు

  • ఆవేశం – రచన - అబ్బురం
  • అధ్యయనం – ఆలోచన  - రచన
  •  ఆలోచన  - అధ్యయనం - రచన
  •  రచన -  ఆలోచన  - అధ్యయనం
  • వేదం సర్వజనీనం – సర్వ కాలినం
  • - భారత ఇతిహాసం పదులవేల సంవత్సరాలది. కాలం ఎన్నింటినోమింగుతుంది. పైగా భారతదేశం వేయేళ్ళు పరాయిపాలకుల  బానిసత్వంలో బతికింది. భారత స్వప్రయోజనపరులు తక్కువవారేంకాదు. తమతల్లినికూడా తార్చగలవారు. ఎవరు మాయం చేశారో ఎలా చెప్పటం? ఇన్నింటిని తట్టుకొని భారతీయ వైద్యవిధానం ఇవ్వాళ యూరోపు అమెరికాకు పాకిందంటే – దాని బలం గుర్తించండి. భారత ప్రజగా గర్వించండి. బానిసలుగా మూలగకండి. ఇది స్థాలీపులాకం -
  •  - ఇది వేదాలను వెల్లడి చేయటమే సంకల్పంగా కల శ్రీ అక్షరవాచస్పతి డాక్టర్ దాశరధి రంగాచార్య గారి మాట.
  • ఋగ్వేదం కొరకు నొక్కండిక్కడ
  • యజుర్వేదం  కొరకు నొక్కండిక్కడ
  • అధర్వవేదం  కొరకు నొక్కండిక్కడ

Jyotisham (Telugu)

Muhurtha Darpanam (eBook)
Jyotirvedam I (eBook)
Jyotirvedam-II
Sarvartha Chintamani (eBook)
Saaravali (eBook)
Purvakalamrutham (eBook)
Dwadasha Phala Pradarshini (eBook)
Bruhad Parashara Hora Sastramu (eBook)
Shatayoga Manjari (eBook)
Nakshathra Veedhullo Bharatheeyula Paathra (eBook)
Sripathi Jyothissasthra Rathnamu (eBook)
Jyothisa Rathnamu
Bharatheeyam (eBook)

Click for more books & Software

Dance – Souvenir (Telugu)

[click to view/ download]

Maithili Manasam (Telugu)

[click to view/ download]

RamaTatwam (Telugu)

[click to view / save]

Yanki_Patalu (Telugu)

[click to download]

మూర్ఖ పద్దతి-2

౨) ఉత్తతిత్తి దీని యుపయోగములు లేవు

తిత్తికొరకు చెడును దేవులాడి

కత్తిమీదసాము కడతేరబోదయా

విశ్వదాభిరామ వినురవేమ

తిత్తి అంటే చర్మముతో చేయబడిన సంచి. సంచితో వస్తువులు, నీళ్ళు వంటివి తీసుకురావచ్చును. సరుకులు దాచిపెట్టవచ్చును. కానీ శరీరమనే సంచికి తొమ్మిది చిల్లులు. దాచాలన్న తాపత్రయంతో ఎన్నో ఎన్నింటినో దాంట్లో వేసినా దాగక చివరికి బయటికే వస్తాయి. అందువలన ఏ ఉపయోగము లేని సంచి ఈ శరీరము. పనికిరాని శరీరపు సంచికోసం రకరకాల విషయవాంఛలకు లోనై మోసం, దగా, వ్యభిచారము, కుట్రలను చేస్తూ మద్యపానము, ధూమపానము వంటి అలవాట్లకు బానిసలై, వాటిని సౌకర్యాలుగా భావిస్తూ తనకు చుట్టూ ఉన్నవారికి అసౌకర్యాన్ని కలిగిస్తూ, చివరాఖరికి తన స్వంతశరీరానికి కూడా అనారోగ్యాన్ని కల్గించే అలవాట్లను వేమన “కత్తిమీదసాము” అని, దానివలన శరీరానికి హాని అని తెలుసుకో ప్రపంచానికి ఇచ్చే ముద్దుబిడ్డా! వేమా! అని వేమన స్వగతం. ప్రపంచం అంటే ప్రకృతి, తల్లి. ప్రకృతి మనకి అన్నీ ఇస్తుంది కానీ మనం ప్రకృతికి ఏం ఇచ్చామన్నది ప్రశ్న. నాఇంటికివస్తే నాకేం తెస్తావు మీ ఇంటికివస్తే నాకేమిస్తావు, అనే నేటి సమాజంలో నేను సమాజానికి, ప్రపంచానికి ఏం ఇచ్చాను అని ప్రశ్నించుకునే జనం లేని వ్యవస్తలో, కనీసం తనగురించి తన పరిసరాలను గురించి గ్రహింపులేని వ్యక్తిత్వం గల నేటి జనారణ్యంలో కనీసం తనగురించి తానైనా ఆలోచించుకొని, చెడును తగ్గించి మంచిని పెంచమని కత్తిమీద సాములాంటి వ్యసనాలను వదులుకోమని వేమన స్వగతం.

మూర్ఖ పద్దతి

౧. మూర్ఖ పద్దతి

౧) ఇన్ని జాతులందు నేజాతి ముఖ్యమన్

ఎరుక గల్గువారె హెచ్చువారు

ఎరుక లేనివారు లేజాతినున్నను

హీనజాతి యంచు నెరుగు వేమ

మనము అందరము కలియుగంలో దక్షప్రజాపతి నుండి వచ్చినవారమే. ఒక కుదురులో వారమే. అయినా వృత్తి ఆధారముగా జాతులు ఏర్పడ్డాయి. జాతుల వర్గీకరణలో, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతులు క్రమశ: ఙ్జాన పోషణ, దేశ పోషణ, ధన పోషణ, ప్రజా పోషణలు కర్తవ్యాలుగా పంచబడ్డాయి. వీరిలో ఎవరు గొప్ప అంటే చెప్పటము కష్టమే. ఏ జాతి ఎరుక ఆ జాతిదే. బ్రాహ్మణుడు వ్యవసాయాన్ని చేసి ప్రజాపోషణను సమర్దవంతంగా నిర్వర్తించలేడు. అదేవిధముగా ఇతరులును. ఈ నాటి పంచబడ్డ ముందువరుసల నుండి పైకివచ్చేవారు, వారి సమర్దతలను గమనిస్తే ఈ విషయము ప్రస్ఫుటము. వేమన “ఎరుక” ఎటువంటిది? జాతుల వర్గీకరణలో వారు గ్రహించిన, ప్రజ్ఞ పాటవాలను పొందిన ఎరుకనా లేక కేవలము పఠనకౌశలమా? ధనబలంతోనో కులబలంతోనో చదువుకొన్నవారు ఏ విధముగా ప్రఙ్జ పాటవాలను ప్రకటిస్తున్నారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అంతేకాక “విద్యాదదాతి వినయం” అనే నానుడి నుండి “విద్యా కుటిలార్దమ్” గా పరివర్తన చెందుతోంది. ఈ నాడు “లంచం” తీసుకునేది, మోసం చేసేది,  చదువుకున్నవాడే. జాతి వర్గ రాజకీయ వైషమ్యాలు చదువు “కొన్న” ఫలితమే. వేమన చదువుకున్న చదువుకోని జాతులను సామాజిక వర్గజాతులకు ముడిపెట్టి ప్రాపంచిక పరిభాషలో “ఎరుక” ను చేర్చి, చదువుకున్న వాడికన్న చాకలాడు మేలనే సామెతను “ఎరుక లేనివారు లేజాతినున్నను హీనజాతి” అని స్వగతం చెప్పుకున్నాడు.